నాని 32వ చిత్రం టైటిల్ ఖరారు.. పుట్టినరోజున అదిరిపోయే అప్‌డేట్

Nanis 32nd Movie Title Fixed Bloody Romeo
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్‌ స్టార్ హీరో నాని తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ సినిమా అప్‌డేట్‌తో ఉత్సాహంలో ఉన్న ఫ్యాన్స్‌కు, తన 32వ చిత్రంతో మరో అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించారు. ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని చేయబోయే ఈ చిత్రానికి ‘బ్లడీ రోమియో’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేస్తూ, ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు.

గతంలోనే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, తాజాగా అధికారికంగా మొదలవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రం ‘ఓజీ’ యూనివర్స్‌కు సంబంధం లేదని, సుజీత్ తొలి చిత్రం ‘రన్ రాజా రన్’ తరహాలో స్టైలిష్ యాక్షన్‌తో కూడిన డార్క్ క్రైమ్ కామెడీగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో నాని ఒకవైపు చెఫ్‌గా కనిపిస్తూనే, మరోవైపు గ్యాంగ్‌స్ట‌ర్‌గా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారని సమాచారం.

ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రి లేదా పూజా హెగ్డే పేర్లను పరిశీలిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్, నాని సొంత బ్యానర్ అయిన యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2026 క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

Go Back to Shorts
Nani
Nani 32nd movie
Bloody Romeo
Sujeeth
Telugu cinema
Prithviraj Sukumaran
Niharika Entertainments
Crime comedy
Pooja Hegde
Tripti Dimri

More Telugu News