యూపీలో పదేళ్ల నాటి హత్య కేసులో సంచలన తీర్పు.. ఒకే కుటుంబంలో 13 మందికి జీవిత ఖైదు

యూపీలో పదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో స్థానిక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. భూవివాదం నేపథ్యంలో ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని దోషులుగా తేలుస్తూ, వారికి జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన సహరాన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... సుమారు పదేళ్ల క్రితం భూమికి సంబంధించిన గొడవల్లో ఇద్దరు సోదరులు హత్యకు గురయ్యారు. ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి వికాస్ గుప్తా సోమవారం తుది తీర్పును వెల్ల‌డించారు. నిందితులపై నేరం రుజువు కావడంతో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు అందరికీ కలిపి రూ. 10.73 లక్షల జరిమానా కూడా విధించినట్లు అదనపు జిల్లా ప్రభుత్వ న్యాయవాది దీపక్ సైనీ తెలిపారు.

శిక్ష పడిన వారిలో సుబ్బా అనే వ్యక్తి నలుగురు కుమారులు మునవర్, ముస్తఫా, సనవర్, స్తఖీమ్‌లతో పాటు ముస్తఫా ఇద్దరు కుమారులు షౌకీన్, మోహ్సిన్‌ కూడా ఉన్నారు. ఒకే కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇంతమందికి యావజ్జీవ శిక్ష పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Uttar Pradesh
Saharanpur Murder Case
UP Crime
Uttar Pradesh Murder
Land Dispute Murder
Double Murder Case
Indian Penal Code
Saharanpur Crime News
Life Imprisonment
Family Crime
Vikas Gupta Judge

More Telugu News