ఐపీఎస్ సునీల్ నాయక్ పై ట్రాన్సిట్ వారెంట్ ను తిరస్కరించిన బీహార్ కోర్టు
- విధానపరమైన లోపాలు ఉన్నాయన్న పాట్నా న్యాయస్థానం
- సునీల్ నాయక్‌పై 30 రోజుల పాటు చర్యలు వద్దని ఆదేశాలు
- రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు బిహార్‌లో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, బిహార్ ఐజీ (ఫైర్ సర్వీసెస్) ఎం. సునీల్ నాయక్‌ను అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. సునీల్ నాయక్‌కు ట్రాన్సిట్ రిమాండ్ ఇచ్చేందుకు పాట్నా సివిల్ కోర్టు నిరాకరించింది. ఏపీ పోలీసులు అనుసరించిన విధానంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేస్తూ, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, 30 రోజుల పాటు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2024లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లాలో నమోదైన కేసులో విచారణ నిమిత్తం ఏపీ పోలీసులు నిన్న పాట్నా చేరుకున్నారు. 2021లో తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి, హత్యాయత్నం చేశారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో సునీల్ నాయక్ ఏ 7గా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏపీ సీఐడీలో డీఐజీగా డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు.
పాట్నాలోని శాస్త్రి నగర్‌లో ఉన్న సునీల్ నాయక్ నివాసానికి నిన్న చేరుకున్న ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాట్నా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టులో హాజరుపరిచి, ఆంధ్రప్రదేశ్‌కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోరారు.
అయితే, ఏపీ పోలీసుల బృందం సరైన అరెస్ట్ వారెంట్ గానీ, అప్‌డేట్ చేసిన కేస్ డైరీ గానీ సమర్పించలేదని కోర్టు గుర్తించింది. స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడాన్ని కూడా తీవ్రమైన విధానపరమైన లోపంగా పరిగణించింది. ఈ కారణాలతో ట్రాన్సిట్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ సునీల్ నాయక్‌ను విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.