తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం.. పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం

Pawan Kalyan Focuses on Strengthening Janasena Party in Telangana
షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జనసేన తెలంగాణ విభాగం ప్రకటన విడుదల చేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జనసేన పార్టీ 'ఉద్యమి' సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని 'ఉద్యమి' సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో బలంగా తీసుకెళ్లి, సంస్థాగతంగా బలోపేతం చేయడానికి జిల్లాలవారీగా కొంతమంది నాయకులకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూతనంగా ఏర్పడిన మూడు కార్పొరేషన్‌లకు వేర్వేరు ఇన్‌ఛార్జులను నియమించారు.

జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్, తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పార్టీ నాయకులు రాధారాం రాజలింగం, కావ్య మండపాక, శిరీష పొన్నూరి రాష్ట్రస్థాయిలో పర్యవేక్షిస్తారని ఆ ప్రకటనలో జనసేన పార్టీ తెలిపింది. ఆయా పార్లమెంట్ పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాల బాధ్యతను రసువుకు నాయకులకు అప్పగించారు.
   
Go Back to Shorts
Pawan Kalyan
Janasena Party
Telangana
Party Strengthening
Membership Drive
Udyami
Political News

More Telugu News