Udhayanidhi Stalin: ఇండియా కూటమి నాయకత్వం అంశంపై ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

Udhayanidhi Stalin Comments on INDIA Alliance Leadership
  • స్టాలిన్ నాయకత్వం వహించాలని వివిధ పార్టీలు కోరుకుంటున్నాయని వ్యాఖ్య
  • రాజకీయాలు, పాలన వంటి అంశాల్లో స్టాలిన్‌ను ఇతర నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నారని వెల్లడి
  • స్టాలిన్ నాయకత్వం కావాలని తాము కూడా కోరుకుంటున్నామన్న ఉదయనిధి
'ఇండియా' కూటమి నాయకత్వ అంశంపై డీఎంకే పార్టీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కూటమికి స్టాలిన్ నాయకత్వం వహించాలని వివిధ పార్టీలు కోరుకుంటున్నాయని అన్నారు. విపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ మార్పుపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ నాయకత్వ రేసులో డీఎంకే కూడా చేరింది.

తమిళనాడులో జరిగిన ఓ సమావేశంలో ఉదయనిధి మాట్లాడుతూ, రాజకీయాలు, పరిపాలన వంటి అంశాల్లో తన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఇతర నేతలు ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించాలని పలు రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు ఆయనను కోరుతున్నారని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేస్తున్న పోరాటానికి స్టాలిన్ నాయకత్వం వహించాలని తాము కూడా కోరుకుంటున్నామని అన్నారు.

త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. డీఎంకే, కాంగ్రెస్ కూటమిలో సీట్ల పంపిణీపై నిన్నటి నుంచి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇలాంటి సమయంలో ఇండియా కూటమి నాయకత్వ అంశంపై ఉదయనిధి మాట్లాడటం గమనార్హం. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూటమిని సరిగ్గా నడపగలుగుతుందని ఎస్పీ, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), ఆర్జేడీ చెబుతున్నాయి.
Udhayanidhi Stalin
INDIA alliance
MK Stalin
DMK
Tamil Nadu
Indian National Congress
Mamata Banerjee

More Telugu News