Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జననాయగన్ విడుదల మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

Jana Nayagan Release Date Pushed to June for Vijay Birthday
Advertisement
  • ఈ నెలలోనూ రిలీజ్ అయ్యే అవకాశం లేదంటున్న నిపుణులు
  • విజయ్ పుట్టిన రోజు సందర్భంగా జూన్ లో రిలీజ్ కు ఏర్పాట్లు
  • రివైజింగ్ కమిటీ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్న నిర్మాతలు
Advertisement
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. నటుడిగా ఆయన ఆఖరి చిత్రం కావడంతో జననాయగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, సెన్సార్ అభ్యంతరాల కారణంగా ఈ సినిమా విడుదల పదే పదే వాయిదా పడుతోంది. ఈ నెలలో జననాయగన్ థియేటర్లలో సందడి చేస్తుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా దీని రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. న్యాయపరమైన చిక్కులు వీడితే విజయ్ పుట్టినరోజు కానుకగా జూన్ లో జననాయగన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

రివైజింగ్ కమిటీ రిపోర్టు కోసం వెయిటింగ్..
మొదట సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఆగిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నా, ప్రస్తుతం సినిమా రివైజింగ్ కమిటీ వద్ద ఉండటంతో ఈ నెలలో కూడా విడుదల సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో మేకర్స్ ఇప్పుడు ఒక 'స్పెషల్ డే'ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. జూన్ 22న విజయ్ పుట్టినరోజు ఉండటంతో జూన్ 18న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

వివాదం నేపథ్యం..
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రాజకీయపరమైన అంశాల వల్ల సెన్సార్ చిక్కుల్లో పడింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలపై నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని కోర్టు సూచించింది. కోర్టులో ఉన్న రిట్ పిటిషన్‌ను నిర్మాతలు ఉపసంహరించుకుని, ప్రస్తుతం సినిమాను రివైజింగ్ కమిటీకి పంపారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగానే తదుపరి అడుగులు పడనున్నాయి.
Advertisement
Advertisement
Vijay
Jana Nayagan
Vijay birthday
Tamil movie release date
H Vinoth
Jananayagan release
Tamil cinema
political movie
censor issues
movie delay

More Telugu News