డబ్బుకు లొంగని వ్యక్తి పవన్ కల్యాణ్... కోట్ల ఆఫర్‌ను వదిలేశారు: హరీశ్ శంకర్
- పవన్ కోట్ల రూపాయల యాడ్ ఆఫర్‌ను తిరస్కరించారన్న హరీశ్ శంకర్
- ప్రజల ఆరోగ్యానికి హానికరమని ఆ యాడ్‌ను వద్దన్న పవన్
- 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పాట పవన్ జీవిత ప్రయాణానికి అద్దం పడుతుందన్న దర్శకుడు
- మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్'
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం డబ్బు కోసం పనిచేసే వ్యక్తి కాదని, తనకంటూ కొన్ని బలమైన సిద్ధాంతాలు, విలువలు ఉన్నాయని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. పవన్ డబ్బుకు ఏమాత్రం లొంగరని, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయల ఆఫర్‌ను సైతం తిరస్కరించారని ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. పవన్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమా ప్రమోషన్‌లో భాగంగా మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'గబ్బర్ సింగ్' (2012) సినిమా బ్లాక్‌బస్టర్ అయిన తర్వాత పవన్ కల్యాణ్‌కు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చిందని హరీశ్ శంకర్ గుర్తుచేశారు. ఆ సమయంలో ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ, అప్పట్లో షారుఖ్ ఖాన్ తీసుకునేంత భారీ రెమ్యూనరేషన్‌తో ఒక యాడ్ కోసం పవన్‌ను సంప్రదించిందని తెలిపారు. అయితే, ఆ ఉత్పత్తి ప్రజల ఆరోగ్యానికి, ముఖ్యంగా చిన్నపిల్లలకు మంచిది కాదనే కారణంతో పవన్ కోట్ల రూపాయల ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారని హరీశ్ శంకర్ వివరించారు. ఆయన వ్యక్తిత్వానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్రంలోని రెండో పాట 'ఆరా ఆఫ్ ఉస్తాద్'ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. పవన్ మెడపై చెయ్యి వేసుకునే మేనరిజానికి మాటల రూపం ఇవ్వాలనే ఆలోచనతోనే "నేను మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే" అనే డైలాగ్ రాశానన్నారు. ఈ పాట కేవలం అభిమానం కోసం రాసింది కాదని, పవన్ జీవిత ప్రయాణం, ఆయన పడిన కష్టం, ఆయన వ్యక్తిత్వం ఇందులో ప్రతిఫలిస్తాయని తెలిపారు. చంద్రబోస్ కేవలం రెండు రోజుల్లో ఈ అద్భుతమైన పాటను రాశారని, దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో పాటాభిషేకం చేశారని కొనియాడారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. సినిమాలో ఫ్యాన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయని, 2 గంటల 35 నిమిషాల సినిమాలో దాదాపు 2 గంటల పాటు పవన్ ను అభిమానులు కనులారా చూసి తృప్తి చెందుతారని హరీశ్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు.