70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్: ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, నటిగా నివేతా థామస్

  • కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం
  • అత్యధికంగా పుష్ప 2 చిత్రానికి అవార్డులు
  • ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, సహాయ నటుడిగా అమితాబ్ బచ్చన్
70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ప్రదానోత్సవం కొచ్చి వేదికగా అట్టహాసంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. 'పుష్ప 2: ది రూల్' కోసం ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు. అల్లు అర్జున్‌కు ఇది ఏడవ ఫిల్మ్ ఫేర్ అవార్డు కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి పేరిట ఉన్న దీర్ఘకాల రికార్డును అల్లు అర్జున్ సమం చేశారు.

'35: చిన్న కథ కాదు' చిత్రానికి గాను నివేతా థామస్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. 'పుష్ప-2' సినిమాకు ఎక్కువ అవార్డులు వచ్చాయి. టాలీవుడ్‌కు పలు అవార్డులు దక్కాయి.

ఉత్తమ చిత్రం: పుష్ప 2
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: పుష్ప 2
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్ ఆఫ్ గోదావరి)
ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ పరిచయ నటి: నయన్ సారిక (గం గం గణేశా)
ఉత్తమ సాహిత్యం: చుట్టమల్లే చుట్టేస్తోంది (దేవర)
ఉత్తమ గాయకుడు: శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టె, గుంటూరు కారం)
ఉత్తమ గాయని: శిల్పారావు (చుట్టమల్లె చుట్టేస్తోంది)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ (కల్కి 2898 ఏడీ), రామకృష్ణ, మోనిక (ఫుష్ప2)
ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టి)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా
ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)


More Telugu News