తిరుమలలో భక్తుల రద్దీ ఇలా..
- తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ
- వైకుంఠం కాంప్లెక్స్ దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లు
- శనివారం శ్రీవారిని దర్శించుకున్న 82,043 మంది భక్తులు
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపలికి విస్తరించాయి. భక్తుల వరుస కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు చేరింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం ఒక్కరోజే మొత్తం 82,043 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లుగా నమోదైంది.