Israel: లెబనాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడి .. 10 మంది మృతి

Israel Air Strikes on Lebanon Kill 10
  • లెబనాన్‌లోని బెకా లోయపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
  • హిజ్బుల్లా సీనియర్ కమాండర్‌తో పాటు 10 మంది మృతి
  • దాడిలో చిన్నారులు, సాధారణ పౌరులు కూడా మరణించినట్లు వెల్లడి
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. లెబనాన్‌లోని బెకా లోయ లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఓ సీనియర్ హిజ్బుల్లా ఫీల్డ్ కమాండర్‌తో సహా 10 మంది మరణించారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. నవంబర్ 2024లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని తెలుస్తోంది. 

ఈ ఘటనపై లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. మృతుల్లో సాధారణ పౌరులు కూడా ఉన్నారని, గాయపడిన వారిలో చిన్నారులు ఉన్నారని ధ్రువీకరించింది. మరణించిన 10 మందిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ దాడితో బెకా లోయ ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది. 

మరోవైపు, ఈ దాడిని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. తమపై దాడి చేసేందుకు హిజ్బుల్లా సన్నాహాలు చేస్తున్నట్లు కచ్చితమైన సమాచారం అందడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది. బెకా లోయలోని హిజ్బుల్లా కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై హిజ్బుల్లా వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజా పరిణామంతో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
 
 
Israel
Lebanon
Israel Lebanon conflict
Bekaa Valley
Hezbollah
air strikes
Middle East tensions
civilian casualties
Hezbollah commander
ceasefire agreement

More Telugu News