శిరీష్ పెళ్లికి బన్నీ గ్రాండ్ పార్టీ.. ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్ దంపతులు

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. హీరో అల్లు శిరీష్ వివాహం త్వరలో జరగనున్న నేపథ్యంలో, ఆయన సోదరుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌గా ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

అల్లు శిరీష్, నయనిక రెడ్డిల వివాహం మార్చి 6వ తేదీన జరగనుంది. పెళ్లి పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల కోసం అల్లు అర్జున్ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇటీవలే శిరీష్ తన స్నేహితులతో కలిసి దుబాయ్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన ఈ ప్రైవేట్ పార్టీకి పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా, రామ్ చరణ్-ఉపాసన జంట బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతేడాది అక్టోబర్‌లో అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే శిరీష్ తన మావయ్య చిరంజీవిని కలిసి తొలి పెళ్లి పత్రికను అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. పెళ్లి పనులతో పాటు ఆహ్వాన పత్రికల పంపిణీ కూడా మొదలైంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల కలయికతో ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుక ఎంతో ఆహ్లాదంగా సాగింది.

Allu Sirish
Allu Arjun
Ram Charan
Upasana
Allu family wedding
Telugu cinema wedding
Pre wedding party
Nayanika Reddy
Chiranjeevi blessings
Hyderabad wedding

More Telugu News