జగన్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన యూత్ కాంగ్రెస్

ఢిల్లీ ఏఐ సదస్సులో తమ నిరసనలపై వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలకు భారత యూత్ కాంగ్రెస్ ఘాటుగా బదులిచ్చింది. ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని గుర్తుచేస్తూ చురకలు అంటించింది. సీబీఐ, ఈడీ కేసుల కారణంగానే జగన్ కొన్ని శక్తులతో రాజీ పడుతున్నారని ఆరోపించింది.

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ ప్రవర్తన దేశానికి సిగ్గుచేటు తెచ్చిందని జగన్ విమర్శించారు. "రాజకీయ విభేదాలు ఏమున్నా, ప్రపంచం ముందు దేశ ప్రతిష్ఠను దిగజార్చే పనులు ఎవరూ చేయకూడదు. మనమంతా ఐక్యంగా నిలవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.

జగన్ వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. "ప్రియమైన జగన్, మీ తండ్రి, మా గర్వకారణమైన నేత వైఎస్సార్ తన జీవితాన్ని మతతత్వ, విభజన శక్తులతో పోరాడటానికి అంకితం చేశారు. మీరు సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. కనీసం మీ తండ్రి వారసత్వాన్ని అయినా ఇంత బహిరంగంగా కించపరచవద్దు" అని యూత్ కాంగ్రెస్ ఓ ప్రకటనలో ఘాటుగా పేర్కొంది.


Jagan Mohan Reddy
Youth Congress
YS Rajasekhara Reddy
CBI
ED
AI Summit
Delhi
Indian Youth Congress
YSR
Corruption

More Telugu News