ఒకరోజు ముందే శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’... రిలీజ్ డేట్ మార్పు
- ఫిబ్రవరి 27నే థియేటర్లలోకి ‘విష్ణు విన్యాసం’
- మరో సినిమా ‘మృత్యుంజయ్’ వాయిదా పడటంతో మారిన విడుదల తేదీ
- ఫన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న చిత్రం
- యదునాథ్ మారుతి రావు దర్శకత్వం
- హీరోయిన్ గా నయన్ సారిక
యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త సినిమా ‘విష్ణు విన్యాసం’ విడుదల తేదీ మారింది. ముందుగా ప్రకటించిన దానికంటే ఒక రోజు ముందే ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 28న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, ఇప్పుడు ఫిబ్రవరి 27, శుక్రవారం నాడు రిలీజ్ చేయనున్నారు.
నిజానికి ఫిబ్రవరి 27న శ్రీవిష్ణు నటించిన మరో సినిమా ‘మృత్యుంజయ’ విడుదల కావాల్సి ఉంది. అయితే, ఆ క్రైమ్ థ్రిల్లర్ వాయిదా పడటంతో ఆ తేదీ ఖాళీ అయింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకు ‘విష్ణు విన్యాసం’ చిత్రాన్ని ఒకరోజు ముందుకు జరిపారు.
ఈ విషయాన్ని హీరో శ్రీవిష్ణు తన సోషల్ మీడియాలో సరదాగా ప్రకటించారు. "జాతకం ప్రకారం... ఈ 27th FEBRUARY నుంచి థియేటర్లలో నవ్వుల వర్షం కురుస్తుంది. మీ జాతకంలో “Non-Stop Fun Dosham” మొదలవుతుంది" అంటూ ఫన్నీ పోస్ట్ పెట్టారు.
యదునాథ్ మారుతి రావు దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో శ్రీవిష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. మూఢనమ్మకాలు, జాతకాలను ఎక్కువగా నమ్మే యువకుడిగా శ్రీవిష్ణు పాత్ర ఆసక్తికరంగా ఉండనుంది. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, రాధన్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 25న యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించనున్నారు.