గద్వాల జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

Gadwal Drip Irrigation Factory Fire Accident in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలోని గద్వాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయిజ పట్టణంలోని రాయచూర్ వెళ్లే మార్గంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫ్యాక్టరీలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడటంతో సిబ్బంది పరుగులు తీశారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో సమీపంలోని స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ డ్రిప్ పైపులు, ముడిసరుకు, యంత్రాలు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి.
Go Back to Shorts
Gadwal
Gadwal fire accident
Telangana fire
Drip irrigation project
Aiza
Factory fire
Short circuit

More Telugu News