భివాండి కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట

Rahul Gandhi gets bail in Bhiwandi court
షార్ట్స్‌లో చూడండి
2014 నాటి పరువు నష్టం కేసులో మహారాష్ట్రలోని భివాండి కోర్టులో లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరెస్సెస్‌పై నాడు చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై మహారాష్ట్రలో కేసు నమోదైంది. ఈ కేసుపై కోర్టులో జరిగిన విచారణకు రాహుల్ గాంధీ ఈరోజు హాజరుకాగా, బెయిల్ లభించింది.

2014 లోక్ సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని సోనాలే గ్రామంలో జరిగిన ర్యాలీలో ఆరెస్సెస్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. మహాత్మా గాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని అన్నారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆరెస్సెస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
Rahul Gandhi
Rahul Gandhi defamation case
Bhiwandi court
RSS
Mahatma Gandhi
Maharashtra

More Telugu News