భిక్షగాడి చిరిగిన చొక్కా వెనుక దాగున్న లక్షల సంపద!
- 500 నోట్ల కట్టతో పాటు విడిగా రూ.16 వేల విలువైన నోట్లు
- పదేళ్లుగా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన వృద్ధుడు
- అనారోగ్యంతో మరణించడంతో బయటపడ్డ సొమ్ము
పదేళ్లుగా భిక్షాటన చేస్తూ కనిపించిన ఒక వృద్ధుడి దగ్గర ఏకంగా లక్షలాది రూపాయల సంపద బయటపడింది. హర్యానాలోని అంబాలాలో వెలుగుచూసిన ఈ ఉదంతం అందరినీ విస్తుగొలుపుతోంది. చిరిగిన చొక్కా, మాసిన బట్టలతో దీనంగా కనిపించే ఆ యాచకుడి పెట్టెలో నోట్లకట్టలు, బ్యాంకు ఖాతాలో లక్షల రూపాయలు ఉండడం స్థానికులను ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే..
అంబాలా రైల్వే స్టేషన్ రోడ్డులోని హనుమాన్ ఆలయం వద్ద లేఖరాజ్ అంటే అందరికీ సుపరిచితమే. పాత మూడు చక్రాల సైకిల్, మాసిన బట్టలు, నీరసించిన ముఖంతో గత పదేళ్లుగా అక్కడే కనిపిస్తూ భక్తులు ఇచ్చే చిల్లరతో కాలం వెల్లదీసేవాడు. తన సైకిల్ వెనుక ఎప్పుడూ ఒక పాత ఇనుప ట్రంకు పెట్టెను కట్టేసుకుని తిరిగేవాడు. కొన్నిరోజులుగా లేఖరాజ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ సంగతి తెలిసి ‘వందేమాతరం దళ్’ అనే సేవా సంస్థ ప్రతినిధులు ఈ నెల 9న లేఖరాజ్ ను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. దురదృష్టవశాత్తు మూడు రోజుల చికిత్స తర్వాత లేఖరాజ్ మరణించారు. దిక్కులేని వృద్ధుడికి ఆ సంస్థ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు.
పెట్టెలో బయటపడ్డ నోట్లకట్ట..
లేఖరాజ్ మరణానంతరం పోలీసులు అతడి సామాన్లను తనిఖీ చేయగా.. పాత ఇనుప పెట్టెలో రూ.50,000 విలువైన 500 నోట్ల కట్ట, మరో రూ.16,120 నగదు విడిగా దొరికింది. అంతేకాదు, అదే పెట్టెలో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్ లో రూ.3,32,000 బ్యాలెన్స్ ఉంది. అంటే, ఒక సాధారణ యాచకుడిగా కనిపించిన లేఖరాజ్ వద్ద దాదాపు 4 లక్షల రూపాయల నిధి ఉంది. తను యాచించగా వచ్చిన ప్రతి పైసాను వృథా చేయకుండా ఇలా కూడబెట్టినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ డబ్బును ఏం చేయాలనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.