Panneerselvam: తమిళ రాజకీయాల్లో సంచలనం... స్టాలిన్ ను కలిసిన పన్నీర్ సెల్వం

Panneerselvam Meets Stalin Sparks Speculation in Tamil Nadu Politics
  • అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్ సెల్వం
  • డీఎంకేలో పన్నీర్ చేరబోతున్నట్టు సమాచారం
  • చర్చల్లో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్, పన్నీర్ సెల్వం కుమారుడు

తమిళనాడులో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో రోజురోజుకీ ఆ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది. ఇప్పటివరకు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ద్విముఖ పోరు మాత్రమే ఉండేది. ఇప్పుడు సినీ నటుడు విజయ్ రాజకీయ ఆరంగేట్రంతో ఈ పోరు త్రిముఖ పోటీగా మారింది. తాజాగా మరో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈరోజు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ ను పన్నీర్ సెల్వం కలిశారు.


స్టాలిన్, పన్నీర్ సెల్వం కలయిక తమిళనాట సంచలనం రేపుతోంది. డీఎంకేలోకి పన్నీర్ సెల్వం చేరికకు సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. దీనికి సంబంధించే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఈ చర్చల్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, పన్నీర్ సెల్వం కుమారుడు కూడా పాల్గొన్నారు. ఇప్పటికే డీఎంకే నేతృత్వంలోని కూటమిలో దివంగత విజయకాంత్ పార్టీ డీఎండీకే చేరిన విషయం గమనార్హం.


మరోవైపు, వీరి సమావేశం జరిగిన తర్వాత అన్నాడీఎంకే ఎమ్మెల్యే అయ్యప్పన్ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ మళ్లీ సీఎం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఎంజీఆర్, జయలలిత ఆశీస్సులు స్టాలిన్ కు ఉన్నాయని అన్నారు.
Panneerselvam
MK Stalin
Tamil Nadu Politics
DMK
AIADMK
Tamil Nadu Elections
Udhayanidhi Stalin
Vijayakanth
DMDK

More Telugu News