Akbaruddin Owaisi: అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

Akbaruddin Owaisi Remarks Rakesh Reddy BJP MLA Responds
షార్ట్స్‌లో చూడండి
'రెడ్డి', 'రావు' ఎవరైనా తమ కాళ్ల వద్దకు రావాల్సిందేనని ఇటీవల మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ శాసన సభ్యుడు పైడి రాకేశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అక్బరుద్దీన్ హిందువుల పట్ల హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల కారణంగా చాలామంది కులాలుగా విడిపోయారని, ఇది మజ్లిస్ పార్టీకి చులకన అయిందని అన్నారు.

కానీ ఇప్పుడు తామంతా కులాలను మరిచిపోయి హిందువులుగా మారుతున్నామని అన్నారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో హిందువులంతా ఏకమవుతున్నారని అన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అలాంటి విమర్శలు చేస్తే చీము నెత్తురు లేని హిందువులకు తెలిసి వస్తుందని అన్నారు. హిందువులు పాములు అని అక్బరుద్దీన్ విమర్శలు గుప్పించారని, అదే నిజమైతే మీరు మూడు కోట్ల నుంచి 20 కోట్లకు వచ్చేవారా? అని నిలదీశారు.

అసలైనా పాములు ఒవైసీ లాంటివారేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. అక్కడ హిందువులను పాములై కరుస్తున్నారని రాకేశ్ రెడ్డి అన్నారు. ఒవైసీ సోదరులు ఎప్పుడూ హిందువులకు, హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంటారని ఆరోపించారు.

కొన్ని రోజుల క్రితం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లో అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రెడ్డి అయినా, రావు అయినా తమ వద్దకు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రుల వద్దకు మేం వెళ్లమని, వారే మా వద్దకు వస్తారని అన్నారు. పనులు కావాలన్నా, సీఎం కావాలన్నా మా మద్దతు ఉండాల్సిందే అన్నారు. ఒవైసీల మద్దతు లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యం కాదని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి తమ పార్టీకే ఉందని అన్నారు.
Go Back to Shorts
Akbaruddin Owaisi
Rakesh Reddy
BJP
Majlis Party
Telangana Politics
Hinduism
Communal Politics

More Telugu News