జగన్ తో భేటీ అయిన అంబటి రాంబాబు.. ఆందోళన అవసరం లేదన్న జగన్!

  • తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన అంబటి 
  • కేసులను చట్టపరంగా ఎదుర్కొందామన్న జగన్
  • పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని మండిపాటు

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, తనపై ప్రభుత్వం పెట్టిన కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసులు వ్యవహరించిన తీరును జగన్‌కు వివరించారు.


అంబటి రాంబాబుతో పాటు జగన్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుబట్టారు. కొందరు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వంలోని పార్టీలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే వేధింపులు, ఆటంకాలను దీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.



More Telugu News