Gaddar: గద్దర్ అవార్డ్స్... రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ కమిటీలో కీలక మార్పులు చేశారు. స్పెషల్ జ్యూరీ ఛైర్మన్ గా నిర్మాత, విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమించారు. లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. 

ఉగాది సందర్భంగా మార్చి 19న గద్దర్ సినీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. గద్దర్ పేరు మీద ఇస్తున్న ఈ అవార్డులు సినీ పరిశ్రలో ఉత్తేజాన్ని నింపుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 2024-25లో విడుదలైన సినిమాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను అవార్డులకు ఎంపిక చేయనున్నారు.
Gaddar
Gaddar Awards
Thammareddy Bharadwaja
Raghavendra Rao
Telangana Film Development Corporation
Telugu Cinema
Film Awards
Ugadi
Tollywood
Movie Awards

More Telugu News