Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

Pawan Kalyan Ustaad Bhagat Singh Second Single Promo Released
  • 'ఆరా ఆఫ్ ఉస్తాద్' పేరుతో రెండో పాట ప్రొమో రిలీజ్
  • ఫిబ్రవరి 22న పూర్తి లిరికల్ వీడియో విడుదల
  • పవన్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం
  • దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్ర బృందం నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలోని రెండో పాట ప్రొమోను మేకర్స్ నేడు విడుదల చేశారు.

‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పేరుతో వస్తున్న ఈ రెండో పాట ప్రొమోను గురువారం విడుదల చేశారు. ఈ పూర్తి లిరికల్ వీడియోను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. 
ఇక, ఈ చిత్రాన్ని మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్. పార్తిబన్, అశుతోష్ రాణా, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి సీజన్‌లో రాబోతున్న తొలి పెద్ద సినిమా ఇదే కావడంతో బాక్సాఫీస్ వద్ద సందడి ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
Pawan Kalyan
Ustaad Bhagat Singh
Harish Shankar
Sreeleela
Devi Sri Prasad
Chandra Bose
Mythri Movie Makers
Telugu Movie
Aura of Ustaad
Gabbarsingh

More Telugu News