దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటం ఖాయం: పాడి కౌశిక్ రెడ్డి

Telangana
Advertisement
  • పార్టీ ఫిరాయించిన దానంపై వేటు పడటం ఖాయమన్న కౌశిక్ రెడ్డి
  • అన్ని ఆధారాలను స్పీకర్ కు అందించామని వెల్లడి
  • ఖైరతాబాద్ కు ఉపఎన్నిక వస్తుందని వ్యాఖ్య
Advertisement

బీఆర్ఎస్ తరపున గెలుపొంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కచ్చితంగా అనర్హత వేటు వేస్తారనే నమ్మకం తమకు ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్ పార్టీ మారారని నిరూపించే అన్ని ఆధారాలను స్పీకర్ కు తాము అందజేశామని తెలిపారు. దానంపై వేటు వేసేందుకు ఇంతకంటే ఏమీ అవసరం లేదని చెప్పారు. 


2024 మార్చి 15న దీపాదాస్ మున్షీ, రేవంత్ రెడ్డి సమక్షంలో దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారని ఆ పార్టీలో చేరారని తెలిపారు. 2024 మార్చి 21న కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్ పేరును ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన దానం 4.29 లక్షల ఓట్లు పొందారని చెప్పారు. ఈ ఆధారాలన్నీ స్పీకర్ కు అందించామని తెలిపారు.


ఒకవైపు రాజ్యాంగాన్ని బీజేపీ తుంగలో తొక్కుతోందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని... మరోవైపు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తోందని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. దానం నాగేందర్ పై వేటు పడటం ఖాయమని... ఖైరతాబాద్ కు ఉపఎన్నిక రావడం కూడా ఖాయమని చెప్పారు. చివరకు న్యాయమే గెలుస్తుందని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

ఐపీఎల్‌లో సరికొత్త సంచలనం.. రిటెన్షన్‌కు 40 కోట్లు డిమాండ్ చేస్తున్న స్టార్స్!

06 Nov, 07:49

ఏఐ దెబ్బ.. స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు! సామాన్యులపై భారీ భారం

06 Nov, 07:25

అమెరికాలో ఘోర ప్రమాదం.. పొన్నూరు యువకుడి దుర్మరణం

06 Nov, 07:00

ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్.. పౌర హక్కుల విభాగం చీఫ్ హర్మీత్ థిల్లాన్ రాజీనామా

06 Nov, 06:43

బోస్టన్‌లో నల్గొండ యువతి అదృశ్యం... కొనసాగుతున్న గాలింపు

06 Nov, 06:28

చంద్రబాబుపై కేసులు.. సీబీఐ విచారణ పిల్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు

05 Nov, 23:27

చికిత్స పేరుతో పిలిపించి చితక్కొట్టారు.. యువ వైద్యుడిని ట్రాప్ చేసిన మలయాళ నటి!

05 Nov, 22:38

క్లీన్ 'యు' సర్టిఫికెట్‌తో వస్తున్న 'సమ్మర్ హాలిడేస్'.. రేపే గ్రాండ్ రిలీజ్

05 Nov, 22:29

చెన్నైలో వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్

05 Nov, 22:12

రజనీకాంత్ పుట్టినరోజు.. నెల రోజుల పాటు వేడుకలు జరపనున్న లారెన్స్

05 Nov, 21:55

రాహుల్ ర్యాలీకి గైర్హాజరు: మేనమామ పెద్దకర్మకు వెళ్లినా యూత్ కాంగ్రెస్ నేతపై వేటు!

05 Nov, 21:46

దేశవ్యాప్తంగా వందే భారత్ హవా.. నిండిపోతున్న సీట్లు, స్లీపర్లకు ఫుల్ డిమాండ్

05 Nov, 21:37

యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2026.. ఫలితాలు వచ్చేశాయి!

05 Nov, 21:19

కిరణ్ తో సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసిన రామ్ చరణ్

05 Nov, 21:08

గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు.. తృటిలో బయటపడ్డ ఎమ్మెల్యే వీరేశం

05 Nov, 20:52
..More Telugu News