Ram Charan: రామ్ చరణ్ చిన్నప్పుడు చాలా సైలెంట్: సురేఖ

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. 'ప్రతి పురుషుడి విజయానికి వెనుక ఒక మహిళ ఉంటుందని అంటారు.. నా విజయానికి వెనుక కూడా సురేఖే ఉంది' అని ఆయన పేర్కొన్నారు. 

1980 ఫిబ్రవరి 20న సురేఖతో తన వివాహం జరిగినట్లు గుర్తు చేసుకున్న చిరంజీవి, అప్పటి నుంచి ఆమె తనకు అండగా నిలిచి జీవిత ప్రయాణంలో ప్రధాన బలంగా మారిందని ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తించారు. 

రామ్ చరణ్ చిన్ననాటి సంగతులు

గతంలో ఓ ఇంటర్వ్యూలో సురేఖ తన కుమారుడు రామ్ చరణ్  గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి చరణ్ చాలా సైలెంట్‌గా ఉండేవాడని, అసలు అల్లరి చేసేవాడు కాదని చెప్పారు. అయితే టీనేజ్‌లోకి వచ్చాక కొద్దిగా చలాకీతనం పెరిగిందని వెల్లడించారు.

చరణ్‌కు ‘కిల్లీ’ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన ఆమె.. చిన్నపిల్లలు వేసుకోకూడదని చెప్పినా, పక్కకు వెళ్లి సందులో నిలబడి సైలెంట్‌గా తినేవాడని సరదాగా గుర్తుచేసుకున్నారు. 

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Ram Charan
Surekha Konidala
Chiranjeevi
Ram Charan childhood
Peddi Movie
Janhvi Kapoor
Buchi Babu Sana
Telugu Cinema
Tollywood
Mega Family

More Telugu News