Korutla incident: బుర్ఖా ధరించి బస్సులో మహిళల పక్కన కూర్చున్న వ్యక్తి.. కోరుట్లలో ఘటన

తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్లలో ఒక యువకుడు రీల్స్ కోసం బుర్ఖా వేసుకుని బస్సు ఎక్కడం కలకలం రేపింది. యువకుడు బుర్ఖా వేసుకుని బస్సులో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. బుర్ఖాలోని వ్యక్తిది మగ గొంతుగా గుర్తించిన ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బస్ స్టేషన్ వద్దకు చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తాను రీల్స్ కోసం బుర్ఖా ధరించానని ఆ యువకుడు వెల్లడించాడు. బుర్ఖా ధరించిన వ్యక్తి మహిళల పక్కన కూర్చున్నాడు. దీంతో ఆడవాళ్ల పక్కన కూర్చోవడానికి బుర్ఖా ధరించావా అంటూ పోలీసులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Korutla incident
Burqa
Telangana
Jagitial district
Bus
Reels
RTC
Police

More Telugu News