రజనీకాంత్ 'కొచ్చాడయాన్'కు ఏఐ హంగులు
- సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ కొచ్చాడయాన్
- విజువల్స్ కార్టూన్ సినిమాను తలపిస్తున్నాయంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు, ట్రోల్స్ వచ్చిన వైనం
- సరికొత్త హంగులతో టీజర్ విడుదల
- తలైవా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న ఏఐ సాయంతో రూపొందించిన టీజర్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ కొచ్చాడయాన్. 2014లో విడుదలైన ఈ యాక్షన్ - అడ్వెంచర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్‌గా కనిపించింది.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో విస్తృత చర్చకు దారి తీసింది. విజువల్స్ కార్టూన్ సినిమాను తలపిస్తున్నాయంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు, ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.
అయితే తాజాగా ఈ మూవీకి సరికొత్త హంగులతో టీజర్ విడుదలైంది. ఏఐ సాయంతో రూపొందించిన ఈ టీజర్ తలైవా అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, మొత్తం సినిమాన్నే ఏఐ టెక్నాలజీతో రీ - జనరేట్ చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన విషయం విదితమే.