ఆ వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఊహించలేదు: త్రిష
- తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం
- "అగౌరవాన్ని ఎప్పటికీ సహించను" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
- తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని న్యాయవాది ద్వారా స్పష్టత
- వ్యక్తిగత జీవితాలను రాజకీయ చర్చల్లోకి లాగొద్దని హితవు
- నటుడు విజయ్‌ను విమర్శిస్తూ నైనార్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ప్రముఖ నటి త్రిష తీవ్రంగా స్పందించారు. "అగౌరవాన్ని ఖండించాల్సిందే, ఎప్పుడైనా సరే" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వివాదంపై తన న్యాయవాది ద్వారా సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసి, తన రాజకీయ వైఖరిపై పూర్తి స్పష్టత ఇచ్చారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇంతటి అనుచిత వ్యాఖ్యలు వస్తాయని తాను ఊహించలేదని త్రిష తన న్యాయవాది నిత్యేశ్ నటరాజ్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని తేల్చి చెప్పారు. తనను కేవలం తన నటన, వృత్తిపరమైన జీవితంతోనే గుర్తించాలని, రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఆమె కోరారు.
"వ్యక్తిగత జీవితాలను ఎప్పుడూ బహిరంగ చర్చకు పెట్టకూడదు. ముఖ్యంగా ఉన్నత పదవుల్లో ఉన్నవారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి" అని ఆ ప్రకటనలో హితవు పలికారు. తనకు సంబంధం లేని విషయాల్లోకి తన పేరును లాగవద్దని త్రిష విజ్ఞప్తి చేశారు.
ఇటీవల నటుడు విజయ్ సేలంలో నిర్వహించిన రాజకీయ ర్యాలీని విమర్శిస్తూ, రాజకీయాల్లో ఆయనకు అనుభవం లేదని చెప్పే క్రమంలో నైనార్ నాగేంద్రన్.. "విజయ్ ముందు నటి త్రిషతో రిలేషన్ నుంచి బయటకు రావాలి... అప్పుడే రాజకీయ ప్రపంచం ఎలా ఉంటుందో అర్థమవుతుంది" అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. డీఎంకే సహా పలు పార్టీలు, వర్గాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలోనే త్రిష ఈ విధంగా స్పందించారు.