Ishan Kishan: యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్

Ishan Kishan Breaks Yuvraj Singh Record
  • నిన్న పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించిన భారత్
  • 40 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇషాన్ కిషన్
  • 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి యువీ రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో గ్రూప్-ఏలో వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టింది. టోర్నమెంట్‌లో సూపర్-8 దశకు అధికారికంగా అర్హత సాధించింది. 


ఈ మ్యాచ్ లో భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మెరుపు బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించాడు. ఇషాన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. భారత్ తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ ఇది. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.
Ishan Kishan
Ishan Kishan batting
T20 World Cup
India vs Pakistan
Yuvraj Singh record
fastest half century
Indian cricket team
cricket
T20

More Telugu News