యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేసిన ఇషాన్ కిషన్
- నిన్న పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించిన భారత్
- 40 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇషాన్ కిషన్
- 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి యువీ రికార్డును బద్దలు కొట్టిన ఇషాన్
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. ఈ విజయంతో గ్రూప్-ఏలో వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టింది. టోర్నమెంట్‌లో సూపర్-8 దశకు అధికారికంగా అర్హత సాధించింది.
ఈ మ్యాచ్ లో భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మెరుపు బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించాడు. ఇషాన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. భారత్ తరపున టీ20ల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ ఇది. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు.