Tilak Varma: తిలక్ వర్మపై గంభీర్ అసహనం!

Gautam Gambhir unhappy with Tilak Varmas performance
  • పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడుతూ అభిమానులను నిరాశపర్చిన తిలక్ వర్మ
  • తిలక్ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 
  • వేగంగా ఆడాలని, స్కోరు 170 దాటేలా టార్గెట్ పెట్టాలని సూచించిన గంభీర్ 
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్ -2026లో భాగంగా పాకిస్థాన్‌‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన తిలక్.. ఆ తర్వాత నెమ్మదిగా ఆడుతూ అభిమానులను నిరాశపరిచాడు. ఒకవైపు ఇషాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా.. తిలక్ మాత్రం జిడ్డు ఆటతో పరుగులు తీసేందుకు తడబడ్డాడు. ఈ క్రమంలో తిలక్ ఆటతీరుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
 
డ్రింక్స్ బ్రేక్ సమయంలో డగౌట్ నుంచి బయటకు వచ్చిన గంభీర్.. తిలక్ వర్మతో చాలా సీరియస్‌గా మాట్లాడినట్లు తెలుస్తోంది. వేగంగా ఆడాలని, స్కోరు 170 దాటేలా టార్గెట్ పెట్టాలని గంభీర్ గట్టిగా సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తిలక్ కొంత ఇబ్బంది పడ్డాడు. చివరికి 24 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తిలక్ స్ట్రైక్‌రేట్ 104.17గా నమోదైంది.
Tilak Varma
Gautam Gambhir
T20 World Cup 2026
India vs Pakistan
Indian Cricket Team
Abhishek Sharma
Ishan Kishan
Cricket
Batting
Strike Rate

More Telugu News