Salman Agha: టీ20 వరల్డ్ కప్: భారత్ పై టాస్ గెలిచిన పాకిస్థాన్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్ లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుని జట్టులోకి రావడం భారత్ కు శుభపరిణామం.

ఈ టోర్నీలో ఇప్పటివరకు గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్ జట్లు అద్భుత ఫామ్ లో ఉన్నాయి. ఇరు జట్లూ చెరో రెండు మ్యాచ్ లు ఆడి, రెండింటిలోనూ విజయం సాధించి అపజయం ఎరుగకుండా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్ గా నిలుస్తుంది. ప్రస్తుతం మెరుగైన రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇప్పటికే రెండు విజయాలతో మంచి ఊపు మీదున్న ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

భారత జట్టు 
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.

పాకిస్థాన్ జట్టు 
సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, మహమ్మద్ నవాజ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.
Salman Agha
India vs Pakistan
T20 World Cup 2026
Pakistan Cricket
Suryakumar Yadav
R Premadasa Stadium
Colombo
Cricket Match
Group A
Cricket

More Telugu News