Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి భేటీ .. కొత్తగూడెంపై కొనసాగుతున్న ఉత్కంఠ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ రాష్ట్ర నేత పల్లా వెంకట్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితులపై చర్చించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ కూటమి (కాంగ్రెస్-22, సీపీఎం-1) కలిపి 23 డివిజన్లలో విజయం సాధించింది. 

సీపీఐ 22 స్థానాలు, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, స్వతంత్రులు 6 డివిజన్లలో గెలుపొందారు. స్వతంత్రుల్లో ఒకరు సీపీఐకి మద్దతుదారుడిగా ఉండటంతో ఆ పార్టీ బలం 23కు చేరింది. మిగిలిన ఐదుగురు స్వతంత్రుల్లో ముగ్గురు, అలాగే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు సభ్యులు కాంగ్రెస్ కూటమికి మద్దతు తెలపడంతో కూటమి బలం 29కు పెరిగింది. 

మేయర్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్, సీపీఐలు కలిసే నడుస్తాయా లేదా విడిగా వ్యూహం రచిస్తాయా అన్న అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Revanth Reddy
Palla Venkat Reddy
CPI
Kothagudem Municipal Corporation
Telangana Politics
Municipal Elections
Congress
BRS
BJP

More Telugu News