Yanamala Ramakrishnudu: ఏపీ బడ్జెట్‌పై మాజీ ఆర్థిక మంత్రి యనమల ఏమన్నారంటే...!

Yanamala Ramakrishnudu Appreciates AP Budget
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ 2026-27 వార్షిక బడ్జెట్‌పై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశంసలు కురిపించారు. ఇది ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ అని అభివర్ణించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌ను రూపొందించారని అభినందించారు.

ఈ సందర్భంగా యనమల స్పందిస్తూ... "బడ్జెట్‌లో చేసిన కేటాయింపులతో ప్రజా ఆకాంక్షలు నెరవేరతాయని ఆశిస్తున్నాం. ముఖ్యంగా రుణాలను నియంత్రించేలా ఈ బడ్జెట్ ఉంది. రుణాల రీ-షెడ్యూల్, వడ్డీ తగ్గించడం వంటి చర్యల ద్వారా ఆర్థిక శాఖ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటపడేస్తుందన్న నమ్మకం ఉంది" అని తెలిపారు.

పరిశ్రమలు, పెట్టుబడులు, అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వడం మంచి పరిణామమని యనమల హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో, సామాజిక న్యాయం దిశగా బడ్జెట్‌ను తీర్చిదిద్దడం అభినందనీయమని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Yanamala Ramakrishnudu
AP Budget 2026-27
Andhra Pradesh Budget
TDP
State Finances
Debt Management
Economic Development
Social Justice

More Telugu News