దామోదరం సంజీవయ్యకు జగన్ నివాళి
- నేడు దామోదరం సంజీవయ్య జయంతి
- దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి అంటూ జగన్ కితాబు
- పేదల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని ప్రశంస
దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ అధినేత జగన్ నివాళులు అర్పించారు. ఎక్స్ వేదికగా జగన్ స్పందిస్తూ... అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు, దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు అని కొనియాడారు. పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కితాబునిచ్చారు. ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.