తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతం.. ఏపీ బడ్జెట్ హైలైట్స్ పార్ట్ - 2

  • బీసీ కాంపోనెంట్ కోసం రూ. 51,021 కోట్లు
  • ఎన్టీఆర్ భరోసా ( పెన్షన్స్)కు రూ. 27,719 కోట్లు
  • ఎంఎస్‌ఎంఈలకు రూ. 3,161 కోట్లు
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ విధానమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు.

రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపుకు తీసుకెళుతున్నామని పయ్యావుల చెప్పారు. రాయలసీమ రైతుల కలలను ఈ బడ్జెట్ సాకారం చేస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా యువతకు గుండె నిబ్బరాన్ని ఇస్తుందని చెప్పారు. తొమ్మిది జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

బడ్జెట్ వివరాలు:
  • ఎంఎస్‌ఎంఈలకు - రూ. 3,161 కోట్లు
  • మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖకు - రూ. 1,283 కోట్లు
  • ఎన్టీఆర్ భరోసా ( పెన్షన్స్)కు - రూ. 27,719 కోట్లు
  • స్త్రీ శక్తి పథకానికి - రూ. 1,420 కోట్లు
  • గృహ నిర్మాణ శాఖకు - రూ. 6,357 కోట్లు
  • ఎనర్జీ శాఖకు - రూ. 13,934 కోట్లు
  • పోలీస్ శాఖకు 3 వేల కొత్త వాహనాలు
  • కొత్త ఏపీ పోలీస్ అకాడమీ ఏర్పాటు కోసం 94 ఎకరాలు
  • ఐటీ శాఖకు - రూ. 536 కోట్లు
  • పర్యావరణం, అటవీ, విజ్ఞాన శాస్త్రంకు - రూ. 714 కోట్లు 
  • పట్టాణాభివృద్ధి శాఖకు - రూ. 14,539 కోట్లు 
  • హౌసింగ్ కు - రూ. 5,451 కోట్లు 
  • పంటల బీమాకు - రూ. 250 కోట్లు
  • మైనార్టీ వర్గాల సంక్షేమానికి - రూ. 6,090 కోట్లు
  • ఎస్సీ కాంపోనెంట్ కోసం - రూ. 20,644 కోట్లు
  • బీసీ కాంపోనెంట్ కోసం - రూ. 51,021 కోట్లు
  • ఎస్టీ కాంపోనెంట్ కోసం - రూ. 9,190 కోట్లు
  • ఏప్రిల్ ఒకటి నుంచి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
  • ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ కు - రూ.10,699 కోట్లు.


More Telugu News