India vs Pakistan: టీ20 వరల్డ్ కప్: పాక్‌తో మ్యాచ్ కోసం కొలంబో చేరుకున్న భారత్

India vs Pakistan T20 World Cup match in Colombo
  • రేపు ప్రేమదాస స్టేడియంలో దాయాదుల మధ్య కీలక పోరు
  • ఇప్పటికే చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో భారత్, పాక్
  • ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలిచే అవకాశం
  • గతంలో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించిన పాక్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు బయల్దేరింది. ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. శుక్రవారం సాయంత్రం భారత ఆటగాళ్లు, వారి కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొలంబోకు పయనమయ్యారు.

గ్రూప్ 'ఏ'లో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు ఆడిన రెండేసి మ్యాచ్‌లలోనూ విజయం సాధించాయి. సూపర్ 8కు అర్హత సాధించే క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఇందులో గెలిచిన జట్టు గ్రూప్ టాపర్‌గా నిలవడంతో పాటు, తర్వాతి దశకు మెరుగైన ఆత్మవిశ్వాసంతో వెళ్లే అవకాశం ఉంది. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో అమెరికాపై 29 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో నమీబియాపై 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు పాకిస్థాన్ నెదర్లాండ్స్, అమెరికా జట్లను ఓడించింది.

అయితే, ఈ మ్యాచ్ నిర్వహణపై గతంలో అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం మొదట ప్రకటించింది. ఐసీసీతో జరిపిన చర్చలు, మ్యాచ్ రద్దయితే భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని శ్రీలంక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తితో పాక్ చివరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో దాయాదుల పోరుకు మార్గం సుగమమైంది.    
India vs Pakistan
T20 World Cup
Pakistan cricket
India cricket
Colombo
R Premadasa Stadium
T20 World Cup 2026
India Pakistan match
cricket match
Sri Lanka

More Telugu News