Gorantla Butchaiah Chowdary: ఆయన వంటి మీద అన్నీ గోల్డ్... మనిషి కూడా గోల్డ్: బుచ్చయ్యచౌదరి గురించి నారా లోకేశ్ వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ సమావేశాల మూడో రోజు లాబీల్లో సరదా వాతావరణం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో నేతల మధ్య చమత్కారాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజమండ్రి రూరల్ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మంత్రి నారా లోకేశ్ బుచ్చయ్య తాత అంటూ అప్యాయంగా పలకరించారు. 

లాబీలో ఆయనను ఆలింగనం చేసుకుని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులకు చూపిస్తూ లోకేశ్ చమత్కారంగా ఆయన కళ్లజోడు గోల్డ్, వాచ్ గోల్డ్, రింగ్ గోల్డ్, ఫోన్ గోల్డ్, పెన్ గోల్డ్…మనిషి కూడా గోల్డ్! అంటూ కితాబిస్తూ, షర్ట్ మాత్రం స్టైలిష్‌ అని అన్నారు.

ఈ సరదా సంభాషణలో వెనుక నుంచి మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందిస్తూ 'రాజకీయాల్లో బుచ్చయ్య గారు ఓల్డ్!' అని చమత్కరించడంతో అక్కడున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నవ్వులు చిందించారు. ఇలా కాసేపు లాబీల్లో సందడి వాతావరణం నెలకొంది.
Gorantla Butchaiah Chowdary
Nara Lokesh
AP Assembly
Andhra Pradesh Politics
Gottipati Ravikumar
Rajahmundry Rural
TDP
Telugu Desam Party

More Telugu News