నీట్ ఆధారంగా నర్సింగ్ ప్రవేశాలు: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- బీఎస్ఈ నర్సింగ్ ప్రవేశాలపై కీలక నిర్ణయం
- నీట్-యూజీ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు
- గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
విద్యా రంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలను నీట్-యూజీ పరీక్ష ఆధారంగా నిర్వహించాని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదముద్ర వేశారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షను విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఉన్నతాధికారులతో ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నర్సింగ్ ప్రవేశాలకు ఉత్తమ విధానంపై చర్చించారు. అనంతరం నీట్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు.