మున్సిపల్ ఎన్నికల విజయం వేళ, ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ
- మున్సిపల్ ఎన్నికల్లో విజయంపై ప్రియాంక గాంధీ అభినందన
- సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే ప్రజలు పట్టం కట్టారన్న ముఖ్యమంత్రి
- ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమన్న మల్లు భట్టివిక్రమార్క
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కారణంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీతో రేవంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ గెలుపుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పందించారు. రెండున్నరేళ్ల ప్రజాపాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ సంక్షేమ, అభివృద్ధి పాలనకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం ఆదరణగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారని ప్రశంసించారు.