: తిరుమలలో భక్తుల రద్దీ... అన్ని కంపార్టుమెంట్లు ఫుల్

  • టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం
  • ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్నవారికి 5 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,632 మంది భక్తులు
వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన వారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. టోకెన్లు కలిగిన భక్తులు వారికి నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ సూచించింది.

నిన్న స్వామి వారిని 61,632 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 24,435 మంది తలనీలాలు సమర్పించారు. కానుకల ద్వారా హుండీకి రూ. 3.28 కోట్ల ఆదాయం వచ్చింది. 

More Telugu News