Pakistan Hockey Team: హోటల్ బిల్లు కట్టలేదు.. ఆస్ట్రేలియాలో రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
- ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ హాకీ జట్టుకు ఘోర పరాభవం
- హోటల్ బిల్లు కట్టని ఫెడరేషన్.. రోడ్డున పడ్డ ఆటగాళ్లు
- గంటల తరబడి నిరీక్షణ తర్వాత అతికొద్ది గదుల కేటాయింపు
- ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురు సర్దుకుపోవాల్సిన దుస్థితి
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ జాతీయ క్రీడ హాకీకి ఘోర అవమానం ఎదురైంది. నిధుల కొరత, సమాఖ్య నిర్వాకం కారణంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాకిస్థాన్ హాకీ జట్టు గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. హోటల్ బిల్లు చెల్లించకపోవడంతో యాజమాన్యం బుకింగ్‌ను రద్దు చేయడమే ఈ పరిస్థితికి కారణమైంది.
ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ హాకీ జట్టు ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాకు చేరుకుంది. అయితే, పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (PHF) వారు బస చేయాల్సిన నాలుగు నక్షత్రాల హోటల్‌కు డబ్బులు చెల్లించలేదు. దీంతో హోటల్ యాజమాన్యం వారి బుకింగ్‌ను రద్దు చేసింది. ఈ విషయం తెలియని ఆటగాళ్లు, అధికారులు హోటల్‌కు చేరుకుని, తమకు గదులు లేవని తెలిసి షాక్‌కు గురయ్యారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు జట్టు హెడ్ కోచ్ తాహిర్ జమాన్ పాకిస్థాన్‌లోని పీహెచ్‌ఎఫ్, పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డ్ (PSB) అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గంటల తరబడి రోడ్డుపైనే నిరీక్షించిన అనంతరం, హోటల్ యాజమాన్యంతో మాట్లాడటంతో వారు పరిమిత సంఖ్యలో గదులను కేటాయించారు. దీంతో ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు సర్దుకోవాల్సి వచ్చింది.
వాస్తవానికి, జట్టు వసతి కోసం పీఎస్‌బీ ఇప్పటికే పీహెచ్‌ఎఫ్‌కు సుమారు 49,000 డాలర్ల నిధులను విడుదల చేసినట్లు సమాచారం. అయినప్పటికీ బిల్లు చెల్లించకపోవడం ఫెడరేషన్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ గందరగోళం జరిగిన మరుసటి రోజే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు 2-3 తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్‌లలోనూ పాకిస్థాన్ ఓడిపోవడం గమనార్హం.