Balineni Srinivasa Reddy: తిరుమల లడ్డూ అంశంపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో ఈ అంశంపై అధికార పక్షం, వైసీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ అంశంపై తాజాగా జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంగా చెప్పారని బాలినేని అన్నారు. ఆ అంశంపై పదేపదే మాట్లాడటం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. ఇంతటితో ఈ అంశాన్ని వదిలేయడం మంచిదని... ఎవరైనా తప్పు చేసి ఉంటే వారి సంగతి వేంకటేశ్వరస్వామి, సీబీఐ వాళ్లు చూసుకుంటారని అన్నారు. 

ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేది తమ అధినేత పవన్ కల్యాణ్ చూసుకుంటారని చెప్పారు. 
Balineni Srinivasa Reddy
Tirumala Laddu
TTD
YV Subba Reddy
Adulterated Ghee
Tirupati
Pawan Kalyan
Janasena
Andhra Pradesh Politics

More Telugu News