Luna 9: చంద్రుడిపై గల్లంతైన నాటి స్పేస్ క్రాఫ్ట్ మిస్టరీని తేల్చేసిన కృత్రిమ మేధ!

చంద్రుడిపై విజయవంతంగా దిగిన తొలి మానవరహిత స్పేస్ క్రాఫ్ట్ ‘లూనా 9’ ఆచూకీని ఎట్టకేలకు గుర్తించామని అంతరిక్ష పరిశోధకులు తాజాగా వెల్లడించారు. 1966 ఫిబ్రవరి 3న అప్పటి సోవియట్ యూనియన్ ఈ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి పంపించింది. చంద్రుడిపై విజయవంతంగా దిగిన ఈ వ్యోమనౌక.. చంద్రుడి ఉపరితలానికి సంబంధించి కీలకమైన వివరాలను పంపించింది. అయితే, ఇది కేవలం మూడు రోజుల పాటే పనిచేసింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండా పోయింది.

ఈ స్పేస్ క్రాఫ్ట్ ‘ఓసియానస్ ప్రొసెల్లారమ్’ రీజియన్ లో ల్యాండైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, వ్యోమనౌక దిగిన కచ్చితమైన లొకేషన్ ను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. 1966 నుంచి ఈ విషయంపై శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఈ చిక్కుముడిని విప్పేసిందని యూకే, జపాన్ పరిశోధకులు తెలిపారు. నాసా తీసిన చిత్రాలను పరిశీలించి.. లూనా 9 చంద్రుడిపై దిగి గల్లంతైన చోటును ఏఐ గుర్తించిందని వివరించారు.

ఓసియానస్ ప్రొసెల్లారమ్ రీజియన్ లో లూనా 9 దిగినట్లు భావిస్తున్న కొన్ని లొకేషన్లను ఎంపిక చేసిందని, ఈ ఫలితాలపై మరిన్ని పరిశోధనలు జరిపి కచ్చితమైన లొకేషన్ ను గుర్తిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారత్ కు చెందిన చంద్రయాన్ 2 ఆర్బిటర్ ద్వారా ఈ లొకేషన్లను పరీక్షించి చూస్తామని వివరించారు.
Luna 9
Soviet Union
Oceanus Procellarum
Chandrayaan 2
Artificial Intelligence
Moon Landing
Spacecraft
Lunar Exploration
NASA

More Telugu News