Rohan Bhat: రిటైర్డ్ నేవీ అధికారి, డెంటిస్ట్ దంపతుల హత్య.. పొడిచి చంపిన కొడుకు
- బెంగళూరులో తల్లిదండ్రులను హత్య చేసిన కొడుకు
- కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ
- నిందితుడైన రోహన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
- అమెరికా నుంచి కుమార్తె వచ్చాక పోస్టుమార్టం
బెంగళూరులో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న కొడుకే తన తల్లిదండ్రులను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. విజ్ఞాన్ నగర్‌లోని ఆదర్శ విస్టా అపార్ట్‌మెంట్‌లో బుధవారం ఉదయం ఈ విషాదం జరిగింది. ఈ ఘటనలో భారత నౌకాదళం నుంచి రిటైర్ అయిన కెప్టెన్ నవీన్ చంద్ర భట్ (60), ఆయన భార్య, డెంటిస్ట్ అయిన డాక్టర్ శ్యామలా భట్ (55) మృతి చెందారు. వారి కుమారుడైన రోహన్ భట్‌ను (33) పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం బుధవారం ఉదయం 7:30 గంటల సమయంలో కుటుంబంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన రోహన్.. తన తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన దంపతులను హుటాహుటిన సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు ఉదయం 8:15 గంటలకు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై వైట్‌ఫీల్డ్ డీసీపీ ఎం. నారాయణ్ మాట్లాడుతూ.. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు దారితీసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగం లేకుండా డబ్బు కోసం రోహన్ తల్లిదండ్రులను వేధిస్తున్నాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుమార్తె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత బౌరింగ్ ఆసుపత్రి మార్చురీలో ఉన్న మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తామని డీసీపీ వివరించారు.