Ayyanna Patrudu: సభలో అంతకుమించి లేరుగా!: వైసీపీ సభ్యులపై స్పీకర్ అయ్యన్న సరదా వ్యాఖ్య
- గవర్నర్ ప్రసంగానికి పదేపదే ఆటంకం కలిగించిన వైసీపీ ఎమ్మెల్యేలు
- ప్రసంగం కొనసాగుతుండగానే జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేల వాకౌట్
- 11వ తేదీన 11 నిమిషాలకు మించి వారు సభలో లేరన్న అయ్యన్నపాత్రుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో శాసన సభ సభాపతి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు. కానీ ఆయన ప్రసంగం కొనసాగుతుండగా నిరసన తెలిపి వెళ్లిపోయారు. దీనిపై స్పీకర్ సరదాగా స్పందించారు.
ఈరోజు 11వ తేదీన 11 మంది సభ్యులు 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారని అన్నారు. సభ్యులు గవర్నర్ ప్రసంగం సమయంలో అంతకుమించి లేరుగా అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. సభ్యులు సభా సంప్రదాయాలు పాటించాలని హితవు పలికారు.
కాగా, ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ సహా వైసీపీ సభ్యులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి పదేపదే ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీల్లో పీపీపీ పద్ధతిని రద్దు చేయాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే వైసీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.