కాంగ్రెస్ నేతలపై రూ. 500 కోట్లకు పరువునష్టం దావా వేసిన అసోం సీఎం

  • హిమంత, ఆయన కుటుంబం 12 వందల ఎకరాల భూమిని ఆక్రమించారన్న కాంగ్రెస్ నేతలు
  • తన పరువుకు భంగం కలిగించే ఆరోపణలు చేశారన్న హిమంత
  • జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగోయ్ లపై దావా వేశానన్న సీఎం
అసోం అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ క్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆయన కుటుంబ సభ్యులు 1,200 ఎకరాల భూములు ఆక్రమించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీంతో, కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగోయ్ లపై హిమంత రూ. 500 కోట్లకు పరువునష్టం దావా వేశారు. 

తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేంద్ర సింగ్ బఘేల్, గౌరవ్ గొగోయ్ లపై పరువునష్టం దావా వేశానని హిమంత తెలిపారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై దురుద్దేశపూర్వకంగా, పరువుకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. వారి నుంచి రూ. 500 కోట్ల నష్ట పరిహారం కోరుతూ పరువునష్టం దావా వేశానని తెలిపారు.


More Telugu News