ఐశ్వర్య రాజేశ్ ఓటీటీ సినిమాల్లో క్రేజ్ తగ్గని క్రైమ్ థ్రిల్లర్!

  • తమిళంలో రూపొందిన 'ప్లాన్ బి'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
  • ఇంట్రెస్టింగ్ గా అనిపించే ట్విస్ట్
  • 2021లోనే విడుదలైన సినిమా
  • అయినా చూడాలనిపించే కంటెంట్

అటు తమిళంలోను .. ఇటు తెలుగులోను ఐశ్వర్య రాజేశ్ కి మంచి క్రేజ్ ఉంది. ఓటీటీలలో ఐశ్వర్య రాజేశ్ సినిమాలను మళ్లీ మళ్లీ చూసేవారున్నారు. ఆమె ఎంచుకున్న కథలు .. పాత్రలు .. ఆ పాత్రలలో ఆమె జీవించే విధానమే అందుకు కారణమని చెప్పుకోవాలి. అలా ఆమె చేసిన సినిమాలలో ఓటీటీ వైపు నుంచి ఎక్కువ ఆదరణ పొందినవిగా ఫర్హానా .. డ్రైవర్ జమున .. సొపన సుందరి .. రన్ బేబీ రన్ కనిపిస్తాయి. 

అయితే వాటి సరసనే కనిపించే మరో సినిమాగా 'థిట్టమ్ ఇరాండు' గురించి చెప్పుకోవచ్చు. 'థిట్టమ్ ఇరాండు' అంటే రెండో వ్యూహం అనే అర్థం ఉంది. అందువల్ల 'ప్లాన్ బి' అనే టైటిల్ తోను ఈ సినిమా ఓటీటీలో కనిపిస్తోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఐశ్వర్య రాజేశ్ కనిపిస్తుంది. 2021లో రూపొందిన ఈ సినిమాను, క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడేవారు ఓటీటీలో సెర్చ్ చేసి మరీ చూడొచ్చు. 

కథలోకి వెళితే .. పోలీస్ ఆఫీసర్ 'అధీర' కొత్తగా ఆ సిరీకి వస్తుంది. డ్యూటీలో చేరిన తొలి రోజులలోనే, ఆమె చిన్ననాటి స్నేహితురాలు దీపాసూర్య అదృశ్యమవుతుంది. ఆ తరువాత కాలిపోయిన ఒక కారులో ఆమె మృతదేహం దొరుకుతుంది. ఆమె భర్త కిశోర్ తమకి శత్రువులెవరూ లేరని అధీరాతో చెబుతాడు. ఈ మిస్టరీని అధీరా ఎలా ఛేదిస్తుంది? అనేది కథ. ఆడియన్స్ గెస్ చేయని ట్విస్ట్ తో సాగే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయవచ్చు.



More Telugu News