'శాకుంతలం' గట్టి దెబ్బనే కొట్టింది: డైరెక్టర్ గుణశేఖర్
- 'రుద్రమదేవి' బాగానే ఆడిందన్న గుణశేఖర్
- 'శాకుంతలం' అప్పులు మిగిల్చిందని వ్యాఖ్య
- రిస్క్ తీసుకోవడం ఇష్టమని వివరణ
భారీ చిత్రాలను సమర్థవంతంగా తెరకెక్కించగల దర్శకుల జాబితాలో గుణశేఖర్ కనిపిస్తారు. జానపదాలు .. పౌరాణికాలపై కూడా ఆయనకి మంచి పట్టుంది. అందుకు నిదర్శనంగా ఆయన రూపొందించిన 'రుద్రమదేవి' .. 'శాకుంతలం' సినిమాలు కనిపిస్తాయి. అనుష్క ప్రధానమైన పాత్రగా ఆయన 'రుద్రమదేవి'ని తెరకెక్కిస్తే, సమంత ప్రధానమైన పాత్రగా 'శాకుంతలం' ఆవిష్కరించారు. 2023లో 'శాకుంతలం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రీసెంటుగా ఒక ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ ..' రుద్రమదేవి' సినిమా వలన నాకు నష్టాలు రాలేదు. ఆ సినిమా వలన నాకు ఎలాంటి అప్పులు కాలేదు. కానీ 'శాకుంతలం' మాత్రం గట్టి దెబ్బనే కొట్టింది. ఈ సినిమా ఓటీటీ వైపు నుంచి ఇబ్బంది పెట్టలేదు గానీ, థియేట్రికల్ వైపు నుంచి దెబ్బకొట్టింది. ఈ సినిమా వలన దిల్ రాజు గారు .. నేను ఇద్దరం కూడా సమానంగా రిస్క్ ఫేస్ చేయవలసి వచ్చింది. రావాల్సింది రాకపోవడం వలన ఇబ్బంది పడ్డాము" అని అన్నారు.
'శాకుంతలం' సినిమాపై వచ్చిన ఎమౌంట్ తో నేను తీర్చవలసినవి కొన్ని ఉన్నాయి. ఆ సినిమా ఆ అవకాశం ఇవ్వకపోవడం వలన, తీర్చవలసినవి ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎంతో కొంత అప్పు ఉంటేనే బెటర్ అని నేను అనుకుంటూ ఉంటాను. లేదంటే రిలాక్స్ అవుతామనే భయం నాకు ఉంది. అందువలన నేను పూర్తిగా సేఫ్ జోన్ లోకి వెళ్లకుండా, కొంత రిస్క్ చేస్తూనే ఉంటాను" అని అన్నారు.