బాలకృష్ణపై నటి లయ ఆసక్తికర కామెంట్స్

  • బాలయ్య సెట్స్ లో ఉంటే ఆ ఎనర్జీ వేరన్న లయ
  • ఆయనతో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవమని వ్యాఖ్య
  • మరోసారి అవకాశం వస్తే ఆయనతో కలిసి నటించాలనేది తన కోరికన్న లయ
అమాయకమైన చిరునవ్వు, చక్కని నటనతో నటి లయ ఆ రోజుల్లో కుర్రకారు మనసు గెలుచుకున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన లయ ఆ తర్వాత పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత నటిగా ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. హీరో శివాజీ, లయ జంటగా రూపొందిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్రం ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో లయ మాట్లడుతూ నటసింహం బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య సినిమా 'విజయేంద్రవర్మ'లో లయ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సమయంలో బాలకృష్ణతో ఏర్పడిన అనుబంధాన్ని ఆమె పంచుకున్నారు. 

బాలయ్యగారు సెట్లో ఉంటే ఆ ఎనర్జీ వేరుగా ఉంటుందని లయ అన్నారు. ఆయన ఎంతో డిసిప్లిన్ గా ఉంటారని, అదే సమయంలో సహ నటీనటులతో ఎంతో సరదాగా జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటారని చెప్పారు. ఆయనతో కలిసి నటించడం తనకు దక్కిన గౌరవం అని అన్నారు. అవకాశం వస్తే మరోసారి ఆయనతో కలిసి నటించాలనేది తన కోరిక అని చెప్పారు. లయ కోరికను ఏ దర్శకుడైనా నెరవేరుస్తారేమో వేచిచూడాలి.


More Telugu News