Four Stars of Destiny: మాజీ ఆర్మీ చీఫ్ నరవణె పుస్తకం లీక్.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

Delhi Police Files FIR Over Circulation Of Ex Army Chiefs Unpublished Book
షార్ట్స్‌లో చూడండి
భారత సైన్య మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవణె రాసిన పుస్తకం ప్రచురణకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పేరుతో జనరల్ నరవణె తన ఆత్మకథను రాశారు. అయితే, ఈ పుస్తకం ప్రచురణకు ఇంకా సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు రాలేదని తెలిసింది.

ఇంతలోనే ఈ పుస్తకం ప్రీ-ప్రింట్ కాపీ సోషల్ మీడియా, ఆన్‌లైన్ న్యూస్ ఫోరమ్‌లలో సర్క్యులేట్ అవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై ప్రాథమిక విచారణ జరపగా, కొన్ని వెబ్‌సైట్లలో ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగుయిన్ రాండమ్ హౌస్ ఇండియా తయారు చేసినట్లుగా ఈ పీడీఎఫ్ ఉంది. అంతేకాకుండా కొన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్ వేదికలు ఈ పుస్తకం ముఖచిత్రాన్ని ప్రదర్శిస్తూ, కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించడం పోలీసులను ఆశ్చర్యపరిచింది.

ప్రచురణకు అనుమతులు రాకముందే అత్యంత కీలకమైన పుస్తకం ఎలా లీక్ అయిందనే దానిపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ విభాగంలో కేసు నమోదు చేశారు. ఈ లీకేజీ వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Four Stars of Destiny
MM Naravane
Naravane book leak
Indian Army
Delhi Police
Penguin Random House India
Army Chief
autobiography
book piracy

More Telugu News