మరో సంచలనానికి రెడీ అవుతున్న రిలయన్స్... ఈసారి జియో స్మార్ట్ ఇన్వర్టర్లు

  • ఇప్పటికే టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో
  • ఇప్పుడు చవక ఇన్వర్టర్లతో వినియోగదారుల ముందుకు వస్తున్న జియో
  • విద్యుత్ కోతలున్న వినియోగదారులే టార్గెట్
రిలయన్స్ సంస్థ ఏది చేసినా సెన్సేషనల్ గానే ఉంటుంది. ఇండియాలో సామాన్యుడి చెంతకు కూడా మొబైల్ ఫోన్లను తీసుకెళ్లిన ఘనత రిలయన్స్ ది. ఆ తర్వాత రిలయన్స్ జియో పేరుతో నెట్ వర్క్ సేవలను ప్రారంభించిన జియో... ముందుగా ఉచితం పేరుతో జనాల్లోకి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా ధరలను పెంచుకుంటూ వెళ్లింది. నాణ్యమైన సేవలను అందిస్తున్న నెట్వర్క్ గా రిలయన్స్ దూసుకుపోతోంది. 

తాజాగా గృహ విద్యుత్ అవసరాల కోసం కొత్త ప్రాడక్ట్ ను తీసుకొచ్చేందుకు రిలయన్స్ సిద్ధమవుతోంది. జియో స్మార్ట్ ఇన్వర్టర్ హోమ్ సిస్టం, సోలార్ ప్యానల్ సొల్యూషన్స్ పేరుతో కొత్తగా జియో ఇన్వర్టర్లు రాబోతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు ఉంటున్న సంగతి తెలిసిందే. వేసవిలో కోతలు మరింత ఎక్కువవుతాయి. విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న వినియోగదారులే టార్గెట్ గా జియో ఇన్వర్టర్లను రిలయన్స్ తీసుకురాబోతోంది. 

బయట లభిస్తున్న ఇన్వర్టర్ల ధర దాదాపు రూ. 20 వేల వరకు ఉంటే... జియో ఇన్వర్టర్లు రూ. 5 వేల నుంచి రూ. 9 వేల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. 


More Telugu News